Mark Carney: భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకుంటాం..! 1 y ago
లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన నేపథ్యంలో కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ కీలకవ్యాఖ్యలుచేశారు. భారత్ పట్ల తన వైఖరిని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో కార్నీ స్పష్టం చేశారు. సారూప్యత కలిగిన దేశాలతో కలిసి పని చేస్తామని వ్యాఖ్యానించారు. మాజీప్రధాని ట్రూడో పరిపాలనా కాలంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షిణించాయన్నారు. భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకుంటామని మార్క్ కార్నీ వెల్లడించారు.